గెలుపుకోసం పైలెట్ పూజలు

తాండూరు రాజకీయం వికారాబాద్

గెలుపుకోసం పైలెట్ పూజలు
– అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న పైలెట్
– అక్కడి నుంచి నేరుగా కౌంటింగ్ కేంద్రానికి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో గెలువాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పూజలు చేశారు. ఆదివారం తాండూరు నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వికారాబాద్‌ లోని అనంత పద్మనాభ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన పద్మనాభ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో విజయం వరించేలా స్వామిని వేడుకున్నారు. మరోవైపు పరిగిలో జరిగిన రెండో రౌండ్ ముగిసే సరికి ప్రత్యర్థి మనోహర్ రెడ్డిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి 134 ఓట్ల ముందంజలో ఉన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!