కాంగ్రెస్ పార్టీతో దేశానికి స్వాతంత్రం
– రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకవచ్చిందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు అజరామరంగా నిలుస్తాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అభినందనీయమన్నారు.
రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు అందరు కృషి చేయాలన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల కృసితో ఎమ్మెల్యేగా విజయం సాధించడం -జరిగిందన్నారు. అదే స్పూర్తితో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, సర్దార్ ఖాన్, బస్వరాజు, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్. గాజుల మాధవి, తాండ్ర రాకేష్, జిలాని తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

