అధికార లాంచనాలతో నర్సప్ప అంత్యక్రియలు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అధికార లాంచనాలతో నర్సప్ప అంత్యక్రియలు
– రెడ్డిగణాపూర్‌లో అంతిమ వీడ్కోలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ నర్సప్పకు పోలీసు శాఖ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

బషీరాబాద్ మండలం రెడ్డిగణాపూర్ గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నర్సప్ప(35) యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలోని బ్రిడ్జి గుంతలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే.

సోమవారం సాయంత్రం రెడ్డిగణాపూర్‌లో నర్సప్ప అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు శాఖ నుంచి అధికారులు, సిబ్బంది పాల్గొని అధికార లాంచనాలతో నివాళులు అర్పించారు. అదేవిధంగా నర్సప్ప అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు బందువులు, మిత్రులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తుది వీడ్కోలు పలికారు.

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థి