సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లీ..!
– ఘనంగా రేణుకా నాగ ఎల్లమ్మ జాతర
– దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తులు తాండూరు పట్టణం నెహ్రు గంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ అమ్మవారిని వేడుకున్నారు. శుక్రవారం ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని జీవితకాలమంతా సల్లంగా సూడూ.. తల్లీ అంటూ వేడుకున్నారు. అదేవిధంగా మహిళలు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి బోనాల ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. అదే విధంగా కోరిన కోర్కెలు నెరవేరాయని అమ్మవారికి కోడి పుంజులను తీసుకవచ్చి ఆలయం చుట్టు ప్రదక్షణలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా తాండూరు మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుధాకర్, మార్కెట్ కమిటి కార్యదర్శి రాజేశ్వరి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో పాటు వివిధ పార్టీల నేతలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


మరోవైపు శనివారం జాతర ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటి సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు, హమాలీ కార్మిక సంఘం నేతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం