ఎక్కడికి పోయవూ ఏసూ..!
– తాండూరుకొచ్చి తప్పిపోయిన యువకుడు
– మూడు రోజులుగా ఎదురు చూస్తున్న తండ్రి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటోల్లను వొదిలి ఎక్కడికీ వెళ్ళావు బిడ్డా అంటూ.. తప్పిపోయిన కొడుకు కోసం కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు. తాండూరు మండలంలో జరిగిన సంఘటన కలచి వేస్తోంది.. వివరాల్లోకి వెళితే… తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన బిడ్డే అనంతయ్య కుమారుడు ఏసురత్నమ్(25) వికలాంగుడు. కొన్నేళ్ల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు.
అప్పటినుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. అయితే ఈ నెల 29న శుక్రవారం నుంచి ఇంటి నుంచి తాండూరుకు వెళ్లిన అతను అదృశ్యమయ్యాడు. తెలిసిన వారి వద్ద, బందువుల వద్ద విచారించిన ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి అనంతయ్య కొడుకు ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారు. కుమారుడి ఆచూకీ తెలిస్తే సెల్: 9347874140, 9553824413లకు సంప్రదించాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి…

