ప్రతి దరఖాస్తుకు గ్యారెంటీ భరోసా

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రతి దరఖాస్తుకు గ్యారెంటీ భరోసా
– అర్హులైన పేదలందరికి అమలు చేస్తాం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి భరోసా అందించడమే ప్రజా పాలన ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో 27వ వార్డుకు సంబంధించి ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు.

ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేస్తుందన్నారు. మిగతా ఐదు గ్యారెంటీ పథకాల కోసం అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులను స్వీకరిస్తుందన్నారు. అర్హులందరు ఈ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పథకాల కోసం దళారులను నమ్మొద్దని సూచించారు. దరఖాస్తులు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి భరోసా అందించేలా పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ మధుబాల, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, విజయ దేవి, ప్రవీణ్ గౌడ్, ప్రత్యేకాధికారి వినయ్ కుమార్, నాయకులు అబ్దుల్. రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి. కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, పి.బస్వరాజ్, వడ్డె శ్రీనివాస్, కోర్వార్ నాగేష్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ ఖాజా హుస్సేన్, పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం