అయ్యప్ప భక్తుని గొప్ప మనసు
– ఆలయంలో ప్రతివారం అన్నదానానికి ముందుకు
– పెరుమాళ్లను అభినందించిన ఆలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప స్వామిపై భక్తిని పెంచుకున్న భక్తుడు తన గొప్ప మనసును కూడా చాటుకున్నారు. తాండూరులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి వారం అన్నదానం నిర్వహించేందుకు తాండూరుకు చెందిన శ్రీ సాయిమేథా, ఆపిల్ కిడ్స్ స్కూల్, చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ముందుకు వచ్చారు. బుధవారం పట్టణంలోని అలయంలో ఆలయ కమిటి సమక్షంలో కుమారుడు మణికంఠ రెడ్డి, సతీమణి వనజా వెంకట్ రెడ్డిల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని దేవాలయ కమిటీ అధ్యక్షులు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డిలు అభినందించారు. పెరుమాళ్ల వెంకట్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి బుధవారం మధ్యాహ్నం 12-30గంటల నుంచి అన్నదానం నిర్వహించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఆలయంలో అన్నదానానికి ఎవ్వరు ముందుకు రాని సమయంలో పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఒక సంవత్సరం పాటు అన్నదానం నిర్వహించేందుకు తోడ్పడం అభినందనీయమన్నారు. ఆయన కుటుంబాన్ని అయ్యప్ప స్వామి కృప ఎల్లప్పుడు ఉండాలని, అన్ని రంగాల్లో ఆయన దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఇదికూడా చదవండి…

