నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న కేసీఆర్ ప్ర‌భుత్వం

తాండూరు వికారాబాద్

నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న కేసీఆర్ ప్ర‌భుత్వం
– యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకుల‌పై దాడి దుర్మార్గం
– తాండూరులో నిర‌స‌న వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉద్యోగ‌లిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌ను మోసం చేస్తుంద‌ని తాండూరు కాంగ్రెస్ నాయకులు విమ‌ర్శించారు. టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి పిలుపు మేర‌కు శ‌నివారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన నిరుద్యోగ సైర‌న్‌లో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయ‌కుల‌పై పోలీసులు దాడిచేయ‌డాన్ని ఖండించారు. ఆదివారం తాండూరు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలో ఆందోళ‌న, రాస్తారోకొ నిర్వ‌హించారు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేసే య‌త్నం చేవారు. అక్క‌డే ఉన్న పోలీసులు కాంగ్రెస్ నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నాయ‌కుల‌ను పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షులు బోయ అశోక్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కావ‌లి సంతోష్, ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బంటు వేణుగోపాల్, ఎస్ఎస్‌యూఐ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులు సందీప్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ వ‌స్తే ఉద్యోగాలు ఇస్తామ‌ని గ‌ద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏడేళ్లుగా ఎలాంటి ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పించ‌లేద‌న్నారు. నిరుద్యోగుల‌కు, యువ‌త‌ను కేసీఆర్ మోసం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.
ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పించాల‌ని టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి పిలుపు మేర‌కు నిరుద్యోగ సైర‌న్ నిర్వ‌హిస్తే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయ‌కుల‌పై పోలీసుల‌తో దాడి చేయించ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. తెలంగాణ‌లో నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగ‌వ‌కాశాలు వ‌చ్చేంత‌కు పోరాటం చేస్తామ‌ని, కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించుతామ‌న్నారు. వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీటీసీల ఫోరం నాయ‌కులు అక్బ‌ర్ బాబ‌, నాయ‌కులు బాతుల వెంక‌టేష్‌, నారా అశోక్, యువ‌నాయ‌కులు బాతుల నాగు, ఎన్ఎస్‌యూఐ నాయకులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.