దేశభక్తిని చాటిన మార్వాడి యువమంచ్‌..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

దేశభక్తిని చాటిన మార్వాడి యువమంచ్‌..!
– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రక్తదాన శిబిరం
– పాల్గొన్న ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని అఖిల భారత మార్వాడి యువమంచ్‌ శాఖ దేశభక్తిని చాటుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించింది. శుక్రవారం మార్వాడి యువమంచ్ కాయకులు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బాలాజీ మందిరంలో రక్తదాన బిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు, ఆర్బీఎల్ ఫ్యాక్టరీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఫ్యాక్టరీ వర్కర్ల నుంచి 20 బందితో కూడా రక్తదానం చేయించారు. అనంతరం మార్వాడి యువమంచ్ సేవలను శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. రాబోయే రోజుల్లో మార్వాడి యువమంచ్ నిర్వహించే ృతిమ అవయాల క్యాంపు నిర్వహణకు సహాకారం అందిస్తామన్నారు.

మరోవైపు ఉదయం నుంచి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వైద్యులతో నిర్వహించిన క్తదాన శిబిరంలో దాదాపు 51 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు మంచ్ ప్రతినిధులు, నేతలు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, కుంజ్ బిహారి సోని, రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్ని అగ్రవాల్, మంచ్ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ జోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, సభ్యులు రమేష్ చంద్రబూబ్, విజయ్ ప్రకాష్ సార్డా, రాధాకిషషన్ బూబ్, రాంనారాయణ బూబ్, ప్రకాష్ సోమాని, భగ్ వాన్ దాస్ రూబ్, మహేష్ సార్డా, దీపక్ గగ్రాని, దీనేష్ పర్తాని, అనిల్ సార్డా, అశిష్ సార్డా, వినోద్ జైన్, రాజస్థాని మహిళ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!