ఆదర్శమూర్తి సేవాలాల్ మహరాజ్
– గిరిజనుల సంక్షేమానికి సర్కారు కృషి
– జయంతి వేడుకలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆదర్శమూర్తి అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు. గురువారం తాండూరు పట్టణంలో ఆల్ ఇండియా బంజార వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వాసుపవార్ నాయక్, బంజారా సంఘాల ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోం సమీపంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతి థులుగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారా జాతికోసం, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. గిరిజనులంతా ఐక్యమత్యంగా ఉంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మురళీకృష్ణ గౌడ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు సట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, బోయరవి, నాయకులు బంటు మల్లప్ప, గిరిజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

