దేశంలో బీజేపీ హాట్రిక్ టార్గెట్..!
– పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
– 20న తాండూరు నుంచి బస్సు యాత్ర
– బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో బీజేపీ హాట్రిక్ సర్కారు ఏర్పాటే టార్గెట్ గా ముందుకు సాగుతుందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కె. మాధవ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని జగదాంబ టవర్స్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామమందరం, బాల రామ విగ్రహా ప్రతిష్టాపన తరువాత బీజేపీ ప్రభావం పెరిగిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మూడో సారి ప్రధానిగా నరేంద్రమోడి పనిచేస్తారని అన్నారు.
పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి బస్సు యాత్ర(రాజ రాజేశ్వరి బస్సు యాత్ర) ప్రారంభించడం జరుగుతుందన్నారు. 20న తాండూరు నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. తాండూరు నుంచి ధారూర్, వికారాబాద్, నస్కల్. పరిగి, మన్నెగూడ, చేవేళ్ల నియోజకవర్గం శేరిలింగంపల్లి వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. 23వ తేది వరకు యాత్ర ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించి చైతన్య పరుస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 10 నుంచి 12 స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు.
చేవేళ్ల పార్లమెంట్ పరిధి నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని, ఆయన గెలుపు ఖాయమన్నారు. మరోవైపు శంకర్ పల్లిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై స్థానికేతరులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దాడి నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రభారి విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు యు.రమేష్ కుమార్, ఎం. నరేష్ మహరాజ్, గాజుల శాంతుకుమార్, పటేల్ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు బాలి శివకుమార్, అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్ సాహు శ్రీలత, కిసాన్ మోర్చ్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, కన్వినర్ రజనీకాంత్, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

