ఫైలెట్‌కు లైన్ క్లీయర్..!
– చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ..?
– బీఆర్ఎస్ పార్టీలో జోరందుకున్న ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల కోసం ప్రత్యేక దృష్టిసారించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూల పరిణామాలు ఎదురైన చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లో సత్తా చాటేందుకు వ్యూహాలు చేస్తోంది. తాజాగా చేవేళ్ల పార్లమెంట్ స్థానానికి వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సిద్దమవుతున్నట్లు స్థానికంగా ప్రచారం జోరందుకుంది. ఈ చేవేళ్ల స్థానం నుంచి ముందుగా ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అభ్యర్థిగా ఉంటారని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు గడ్డం రంజిత్ రెడ్డి అనాసక్తి చూపిస్తున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. మరో స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు, అందుకనే చేవేళ్ల స్థానం నుంచి పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రచారం ఉంది.
ఇదిలా ఉండగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి పాలయ్యారు. తమ ఓటమి వెనుక మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిల వెన్నుపోటే కారణమని భావిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇటీవలే జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. చేవేళ్ల పార్లమెంట్ టిక్కెట్టు హామితోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డిపై పోటీగా నిలబడలానికి ఆశిస్తున్నట్లు పార్టి వర్గాలు హింట్‌లు ఇచ్చాయి.
ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిగినట్లు సమాచారం. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం రావడంతో పైలెట్ రోహిత్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదేవిషయంపై తాండూరు రాజకీయాల్లో జోరుగా చర్చకొనసాగుతోంది.
ఇది కూడా చదవండి…

