వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర బ్యాంకును చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు ఆర్థిక వృద్ధిలో సాగాలని ఆకాంక్షించారు. బ్యాంకు ఖాతా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగుల విక్రమ్ సింహా రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ శుశాంత్ కుమార్ గుప్త, తాండూరు బ్రాంచు మేనేజర్ బి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

