హస్తం గూటికి గులాబీ నేతలు..!
– కాంగ్రెస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్లు
– ఎమ్మెల్యే సమక్షంలో యువనాయకుల చేరిక
– ఆహ్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు, యువకులు భారీగా హస్తం గూటికి చేరారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, మాజీ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యురాలు బిడ్కర్ ఉశ, బీఆర్ఎస్‌వై రాష్ట్ర యువనాయకులు బిడ్కర్ రఘు, యువనాయకులు సంకేత్, సిద్దు, వెంకటేష్ తో పాటు దాదాపు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామన్నారు.

అనంతరం పార్టీలో చేరిన నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

