ఫ్లైఓవర్ బ్రిడ్జీ వద్దు.. అండర్ బ్రిడ్జే కావాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఫ్లైఓవర్ బ్రిడ్జీ వద్దు.. అండర్ బ్రిడ్జే కావాలి..!
– నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు
– పాత తాండూరులో ఆందోళన, రంగంలోకి పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫ్లైఓవర్ బ్రిడ్జీ వద్దు.. అండర్ రైల్వే బ్రిడ్జే కావాలని స్థానికులు డిమాండ్ చేశారు. స్థానికులు నిర్మాణ పనులు అడ్డుకోవడంతో ఆందోళన కర పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత కొన్నేండ్లుగా తాండూరు పట్టణంలోని పాత తాండూరు రైల్వే గేటు వద్ద బ్రిడ్జీ నిర్మించాలని డిమాండ్ ఉంది. ఇందుకోసం ఫ్లైఓవర్ బ్రిడ్జీకి శంకుస్థాపన కూడా చేశారు. పైగా ఫ్లైఓవర్ బ్రిడ్జికి పచ్చజెండా కూడా ఊపారు. దీంతో మంగళవారం రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైల్వే గేటు సమీప ప్రజలు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. బ్రిడ్జి పనులు నిలిపివేయాలని ఆందోళన చేశారు. పనులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. పాత తాండూరు వాసులకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కల ఉందన్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే స్థానిక ప్రజల ఆస్తులు కోల్పోవడం జరుగుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దని అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గతంలో ప్రజాప్రతినిధులకు విన్నవించడం జరిగిందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం బ్రిడ్జ్ ను ఫ్లైఓవర్ గా ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

బ్రిడ్జీ కోసం ఆస్తులు కోల్పోతే తిరిగి సంపాదించలేమని అన్నారు. కావున ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిపివేయాలని, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళన ఉదృతంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళన కారులను శాంతింప చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారి పోలిటికల్ టర్న్ తీసుకుంది. కావాలనే నిర్మాణ పనులు చేపట్టడం, అడ్డుకోవడం రాజకీయంలో భాగమే అని పలువురు విమర్శించుకోవడం వినిపించింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!