ముదిరాజ్‌లకు మహర్థశ
– కార్పోరేషన్ ఏర్పాటుతో పెద్దపీట
– 100 రోజుల్లోనే హామిల అమలుకు ప్రాధాన్యం
– ఇందిరమ్మ కమిటిలో ముదిరాజులకు అవకాశం
– ధన్యవాద సభలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కార్పోరేషన్ ఏర్పాటు పట్ల సీఎం రేవంత్‌కు పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజుల్కు మహర్ధశ తీసుకవచ్చిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు పట్ల శుక్రవారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ డీగ్రీ కళాశాలలో ధన్యవాద సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం.రమేష్ మహరాజ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో గతంలో కులాల పేరుతో కమీషన్లు ఏర్పాటు చేసి పబ్బం గడుపుకున్నారని. అప్పుడు ఒకే కుటుంబం బాగుపడిందని విమర్శించారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి నచ్చాక నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రంఎడు రోజుల క్రితమే 16 కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా ముదిరాజ్ కార్పోరేషన్ కూడా ఏర్పాటు చేసిందన్నారు. ముదిరాజులు తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో నా గెలుపుకు కీలక పాత్ర పోషించారని అన్నారు. వారి అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేయాల్సి బాధ్యత ఉందన్నారు.
త్వరలో వేసే ఇందిరమ్మ ఇండ్ల కమిటిలో ముదిరాజులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఫైనాన్స్ కమీషనర్ మెంబర్ రమేష్ మహరాజ్ కోరిన విధంగా స్మశాన వాటిక నిర్మిస్తామన్నారు. అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు పూర్తి మద్దతు ఇవ్వాలన్నారు. దీంతో తాండూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. అంతకుముందు కార్పోరేషన్ ఏర్పాటు పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . చిత్రపటానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో పాలాభిషేకం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు ఎం.రమేష్ మహరాజ్ లను గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్. ఫ్లోర్ లీడర్ మధుబాల, మాజీ కౌన్సిలర్ పరిమళ, అనంతయ్య ముదిరాజ్, లోంక నర్సింలు, బంటు వేణుగొ పాల్, ముదిరాజ్ సంఘం నాయకులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ యాడ్…

ఇది కూడా చదవండి…

