ఈసారి ‘టెన్’షన్ రావద్దు..!
– పది పరీక్షలు సవ్యంగా జరిగేలా దృష్టి పెట్టండి
– ఎంఈఓలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : గత యేడాది టెన్త్ పరీక్షల ప్రశ్నా పత్రం లీకేజీ కావడంతో పరీక్షలు గందరగోళాన్ని సృష్టించాయి. ఇందుకు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతం ముందు స్థానంలో ఉండడంతో ఈ సారి నిర్వహించే పరీక్షలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మరోసారి అలాంటి పరిస్థితి, పరిణామాలకు తావివ్వకుండా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈనెల 18 నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు మండలం, యాలాల మండల విద్యాధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు లేకుండా చూడాలన్నారు. గత ఏడాది పరిణామాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీగౌడ్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఎంఈఓలు సుధాకర్ రెడ్డి, వెంకటయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.
లోకల్ యాడ్…

ఇది కూడా చదవండి…

