మున్సిపల్ అభివృద్ధిపై దృష్టి

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్ అభివృద్ధిపై దృష్టి
– విఘ్నేశ్వర కాలనీ సమస్యలకు పరిష్కారం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం 11వ వార్డులోని విఘ్నేశ్వర కాలనీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డితో కలిసి పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువలు, సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదేండ్లలో తాండూరు మున్సిపల్ లోని అన్ని వార్డుల అభివృద్ధికి దృష్టిసారించడం జరుగుతుందన్నారు. విఘ్నేశ్వర కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యేను స్థానికులు, నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, కౌన్సిలర్లు బోయరవి, రాము, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!