ఘనంగా జగ్జీవన్‌ రాం జయంతి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా జగ్జీవన్‌ రాం జయంతి
– నివాళులు అర్పించిన మున్సిపల్ ఉద్యోగులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ 117వ జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌ రాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటంకు మున్సిపల్ ఉద్యోగులు నివాళులు అర్పించారు. కమీషనర్ మాట్లాడుతూ గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని అన్నారు. ఆయన జీవిత పర్యంతం బడుగు వర్గాల ‌అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

హస్తం గూటికి సంతోష్‌ గౌడ్‌