పార్లమెంట్ ఎన్నికల యంత్రాలు భద్రం

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్లమెంట్ ఎన్నికల యంత్రాలు భద్రం
– తాండూరుకు చేరుకున్న బీయూ, సీయూ, వీవీ ప్యాట్‌లు
– స్ట్రాంగ్ రూంలో కట్టుదిట్టమైన భద్రత
– ఆర్డీఓ శ్రీనివాసరావు సమక్షంలో తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల యంత్రాలు తాండూరుకు చేరుకున్నాయి. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుంచి సహాయ ఎన్నికల అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో తరలించారు. తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లోని స్ట్రాంగ్ రూంలో వీటిని భద్రపరిచారు. ఆర్డీఓ శ్రీనివాస్ రావు సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకుల పర్యవేక్షణలో ఈవీఎం, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లను సిబ్బంది చేత స్ట్రాంగ్ రూంకు తరలించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన 346 బ్యాలెట్ యూనిట్లు, 346 కంట్రోల్ యూనిట్లతో పాటు 387 వీవీ ప్యాట్ లను తరలించడం జరిగిందన్నారు. యంత్రాలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంకు పోలీసు శాఖతో పాటు పారా మిలిటరీ ద్వారా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్, కాంగ్రెస్ నాయకులు, తహసీల్దార్ తారాసింగ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన