టీపీసీసీలో సునీతా సంపత్‌కు స్థానం

తాండూరు రాజకీయం వికారాబాద్

టీపీసీసీలో సునీతా సంపత్‌కు స్థానం
– రాష్ట్ర ఓబీసీ డిపార్ట్‌మెంట్ కన్వీనర్‌గా నియామకం
– ప్రకటించిన రాష్ట్ర చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని టీపీసీసీ కార్యవర్గంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతాసంపత్‌కు స్థానం దక్కింది. టీపీసీసీ రాష్ట్ర ఓబీసీ డిపార్టెమెంట్ కన్వీనర్‌గా ఆమె నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ నియామకాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున చైర్ పర్సన్ అభ్యర్థిగా సునీతా సంపత్ తొలిసారి పోటీలో దిగారు.

అప్పట్లో టీఆర్ఎస్ హావా వీయడంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. కౌన్సిలర్‌గా గెలిచిన సునితా సంపత్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. పదవి అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి యాలాల జెడ్పీటీసీగా పోటికి సిద్దం అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆమె పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున పనిచేశారు.

అనంతరం రోహిత్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతనిధిగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా టీపీసీసీలోనే రాష్ట్ర ఓబీసీ డిపార్టెమెంట్‌ కన్వీనర్‌గా ఆమెను నియమించారు. సునీతాసంపత్‌కు రాష్ట్ర టీపీసీసీలో స్థానం దక్కడం పట్ల తాండూరు నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

పారిశుద్ధ్యం, పవర్ సమస్యలు పరిష్కరించండి