హస్తంతోనే ముదిరాజులకు గుర్తింపు
– ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు కాంగ్రెస్ ఘనతే
– పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజులు మద్దతివ్వాలి
– ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– తాండూరులో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో హస్తం పార్టీతోనే ముదిరాజులకు గుర్తింపు లభించిందని ఆ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు. గురువారం తాండూరులోని ముదిరాజులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా రంజిత్ రెడ్డి. మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ముదిరాజుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. భవిష్యత్తులో ముదిరాజులకు అన్ని రంగాల్లో గుర్తింపు తీసుకవస్తుందని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ రోడ్డు మార్గంలో ముదిరాజులకు స్థలం కె టాయిస్తామన్నారు. తాండూరులో ముదిరాజులు అత్యధికంగా ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు.
మెజార్టీలో ముదిరాజులు కీలకం కావాలన్నారు. అనంతరం ముదిరాజుల ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డి. మనోహర్ రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ కన్వీనర్ సునీతాసంపత్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ’ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి. సర్దార్ ఖాన్. నియోజకవర్గ ముదిరాజులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

