బసవేశ్వరుడి మార్గం ఆచరణీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

బసవేశ్వరుడి మార్గం ఆచరణీయం
– తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– జయంతిలో నివాళులు అర్పించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను వ్యతిరేకించిన బసవేశ్వరుడి మార్గం లోకానికి ఆచరణీయం అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఇందిరా చౌరస్తా వీరశైవ సమాజం కాంప్లెక్స్‌లో ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి రోహిత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మనషులంతా ఒక్కటే అని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు బసవేశ్వరుడు అని కొనియాడారు.

కుల వ్యవస్థను, వర్ణ విభేదాలను, లింగ వివక్షతను వ్యరేకించిన అభ్యుదయ వాది అన్నారు. ప్రజలను కులమతాల అతీతంగా ఏకం చేశారన్నారు. బోధనలోని సమ దృష్టితో ఎందరినో ఆకర్షించి వీరశైవ మతానికి పట్టం కట్టిన బసవేశ్వరుడి ఖ్యాతీ కర్ణాటక ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిందన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నాయకులు బంటారం సుధాకర్, శ్రీనివాస్ చారి, వీరశైవ సమాజం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సమ సమాజ స్థాపకుడు బసవేశ్వరుడు