కాంగ్రెస్ వచ్చాకే కష్టాలు..!
– తెలంగాణ హాయాంలోనే సంక్షేమం, అభివృద్ధి
– కేసీఆర్ పథకాలే దేశానికి ఆదర్శం
– హస్తం సర్కారులో అందరికి అన్యాయం
– బీసీ బిడ్డను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలి
– మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– తాండూరులో బీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాకే అందరికి కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభకు మాజీ మంత్రి సబితారెడ్డి చేవేళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితారెడ్డి చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపు ఖాయమని అన్నారు. మేజార్టీతో గెలిపించి కాసాని గొంతు పార్లమెంట్ లో వినిపించేలా చూడాలన్నారు. కేసీఆర్ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు, అబివృద్ది సాధ్య పడిందన్నారు. రైతులకు 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమాతో పాటు అసరా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, దళితబంధు వంటి పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే పేదలకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. తాగునీరు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నేరవేర్చడంలేదన్నారు. ఐదునెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్లపర్వం కోనసాగిస్తున్నారని, .దేవుల్లపై అబద్దపు ఓట్లు వేస్తూ ఓట్లు సాధించుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కరికీ తిరని అన్యాయం జరిగిందన్నారు. అదేవిధంగా బీజేపీ మతతత్వ ప్రచారం చేస్తూ రాముని పేరుతో ఓట్లు అడుగుతుందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో వెన్నంటు ఉండి వెన్నుపోటు పోడిచిన నేతలను ఇక్కడ తిరష్కరిస్తే.. చేవెళ్లకు పోయారని, అక్కడ తిరష్కరిస్తే మల్కాజిగిరి లో పడ్డారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం
ఇచ్చిన హామిలను నెరవేర్చకుండా ప్రజలను, రైతులను నట్టేట ముంచిందన్నారు.
తాండూరు అభివృద్ధికి రూ. 1680కోట్లనిదులు తెస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తెచ్చిన నిదులను రద్దు చేశారని విమర్శించారు. పాపిస్టు కాంగ్రెస్ నాయకులు అబివృద్ది ని అడ్డుకున్నారు. తాండూరు కాగ్నానది నుండి కొడంగల్ కు నీరు తరలిస్తూన్నారు.తాండూరు నియోజకవర్గంలో చేసిందన్నారు. మోసం చేసిన పార్టీకి బుద్ది చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు పూర్తి మద్దతు ఇచ్చి భారీమేజార్టీఅందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి, తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సలీం, మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

