శభాష్ ఓటరన్నా..!
– తల్లి మరణించినా ఓటు వినియోగం
– ఓటరు కర్తవ్యానికి అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చాలామంది పోలింగ్ రోజును ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. అందుకే అధికారులు, నేతలు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… ఈ సంఘటన గురించి తెలిస్తే శభాష్ ఓటరన్నా అని మీరే ప్రశంసిస్తారు.
వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్ ప్రాంతానికి చెందిన మాసప్ప తల్లి సోమవారం మరణించింది. ఇదే రోజు పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. తన ఇంట్లో తల్లి మరణించినా కూడా మాసప్ప తన హక్కును వినియోగించుకుని కర్తవ్యాన్ని చాటు కున్నారు. ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలోని పోలింగ్ కేంద్రం 133లో తన ఓటు హక్కుతో పాటు కుమారుడతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నేతలు, అధికారులు మాసప్పను అభినందించారు.
ఇదికూడా చదవండి…

