బ‌స్టాండ్ వ‌ద్ద షాపింగ్ కాంప్లెక్స్..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరు, ఆగ‌స్టు 15 (ద‌ర్శిని) : తాండూరు ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలో షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు ప్ర‌జ‌ల అవ‌స‌రాల నిమిత్తం సుల‌బ్ కాంప్లెక్స్ నిర్మిస్తామ‌ని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరుకు వ‌చ్చిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బ‌స్టాండ్ స‌మీపంలో ప‌ర్య‌టించారు. ఎమ్మెల్యే వ‌చ్చిన విష‌యం తెలిసిన స్థానిక వ్యాపారులు ఎమ్మెల్యేకు త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్నవించారు.


బ‌స్టాండ్ స‌మీపంలో క‌నీస అవ‌స‌రాలు అయిన మ‌రుగుదొడ్లు, మూత్ర‌శాల‌లు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్పందిస్తూ బ‌స్టాండ్ స‌మీపంలో ఖాళీ స్థ‌లంలో సుల‌బ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తామ‌ని తెలిపారు. దీంతో పాటు ఆర్టీసీ ఖాళీ స్థ‌లంలో నూత‌న షాపింగ్ మాల్ నిర్మిస్తామ‌ని పేర్కొన్నారు. వెంట‌నే ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, నాయకులు నర్సింలు, శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి, రాజన్న గౌడ్, సంతోష్ గౌడ్ , ఇంతియాజ్, మొయిజ్ తదితరులు ఉన్నారు.