చావులో ట్విస్ట్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
చావులో ట్విస్ట్..!
– చనిపోయాడని అంత్యక్రియలు
– బతికిరావడంతో ఫ్యామిలీ షాక్
– బషీరాబాద్‌ మండలంలో అసక్తికర సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ వ్యక్తి చావు అసక్తిరేపింది. చనిపోయాడని అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా పాడే మోసే సమయంలో కుటుంబీకులకు ఊహించని షాక్ తగిలింది. తమ వ్యక్తి బతికే ఉన్నాడని, చనిపోయింది తమ వ్యక్తి కాదని, గుర్తుతెలియని వ్యక్తికి అంత్యక్రియల నిర్వహణ చేశారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఆసక్తికర సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బషీరాబాద్ మండలంలోని నవాంధి గ్రామానికి చెందిన సుతెల్లి ఎల్లప్ప(35) నావంది పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ వద్ద పశువుల కాపరిగా పనిచేసే వాడు. ఇతనికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మద్యానికి బానిసై పని సరిగ్గా చేయకపోవడంతో పనిలో నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఎల్లప్ప తాండూరులో, వికారాబాద్ ప్రాంతాల్లో అడ్డా కూలీ పనులకు వెళుతున్నాడు. ఒకటి, రెండు రోజులు ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. శనివారం రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఓ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.

అతని వద్ద లభించిన సెల్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగా నవాందికి చెందిన ఎల్లప్స కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రైలు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ముఖం పూర్తిగా చిద్రం కావడంతో గుర్తుపట్టలేకపోయారు. కుటుంభీకులు ఆదివారం మృతదేహానికి గ్రామానికి తీసుకవచ్చారు. అంత్యక్రియ తంతును కూడా నిర్వహించారు. చివరగా పాడే మోసే సమయంలో ఎల్లప్ప బతికే ఉన్నాడని, తాండూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో కనిపించినట్లు కుటుంభీకులకు సమాచారం అందింది.

దీంతో కుటుంభీకులతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుకున్న వికారాబాద్ రైల్వే అధికారులు గ్రామానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి మీతదేహాన్ని వికారాబాద్‌కు అయితే రెండు, మూడు రోజుల క్రితం ఎల్లప్ప తాగిన మత్తులో ఉండగా తన సెల్ ఫోన్ ఎవరో ఎత్తుకెళ్లినట్లు రైల్వే పోలీసులకు తెలిపారు. సెల్ ఫోన్ దొంగిలించిన వ్యక్తే రైలు ప్రమాదంలో మరణించినట్లు రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతుని వివారాలు ఇంకా తెలియరాలేదని రైల్వే పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ ఇచ్చిన తప్పదు..!