ఓట్ల లెక్కింపుకు టీం సిద్దం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఓట్ల లెక్కింపుకు టీం సిద్దం
– నాలుగు నియోజకవర్గాలు ఒకే సారి
– ఎన్ని టేబుళ్లు, ఎన్ని రౌండ్లో నిర్ణయం పూర్తి
– ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు యంత్రాంగం సిద్దమైంది. తాండూరు, పరిగి, వికారాబాద్‌, కోడంగల్ నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఓకేసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిగి మార్కెట్ కమిటిలోని గోదాంలోకి ఈవీఎం, వీవీ ప్యాట్ లను తరలించారు. అక్కడే ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు. గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిగిలో 1,98,986 సాధారణ ఓట్లు, 2821 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. తాండూరులో 1,73,754 సాధారణ ఓట్లు, 1500 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి, కొడంగల్‌లో 1,93,940 సాధారణ ఓట్లు పోలు కాగా 1165 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి,

వికారాబాద్ నియోజకవర్గంలో 1,72,486 సాధారాణ ఓట్లు, 1810 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా 305 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లలో 22 రౌండ్లలో కౌటింగ్ నిర్వహించనున్నారు. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా 269 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లలో 20 రౌండ్ల ద్వారా కౌంటింగ్ జరపనున్నారు. కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా 275 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లలో 20 రౌండ్లలలో కౌంటింగ్ జరగనుంది. వికారాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 284 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లలో 21 రౌండ్లులో కౌంటింగ్ జరగనుంది.

కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం
పరిగిలోని మార్కెట్ కమిటి గోదాంలో ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఈనేపథ్యంలో శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ విధులు నిర్వహించే కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు , మైక్రో అబ్జర్వ్ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ అధికారులు అందరూ సమన్వయంతో సమిష్టిగా పని చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో సూపర్వైజర్ల పాత్ర చాలా కీలకమని పారదర్శకంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలన్నారు.

ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటల వరకే గుర్తింపు కార్డుతో సహా కౌంటింగ్ హాల్లో ఉండాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ తో పాటు కౌంటింగ్ పరిశీలకులు స్నేహ హిందూ రావు పాటిల్, సాధన పరిశీలకులు పి.ఆకాష్, రిటర్నింగ్ అధికారులు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, శ్రీనివాసరావు విజయ కుమారి లతో పాటు జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి, డిఎస్హెచ్ఓ చక్రపాణి, డివైఎస్ఓ హనుమంతరావు, డిటిడిఓ కోటాజి, పరిశ్రమ శాఖ అధికారి వినయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!