చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

కెరీర్ క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrచట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
– తాండూరు న్యాయమూర్తి నామాల అశోక్
– విద్యార్థులతో న్యాయవిజ్ఞాన సదస్సు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తాండూరు స్పెషల్ జ్యూడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు న్యాయమూర్తి నామాల అశోక్ హాజరై మాట్లాడారు. జీవితంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఎవరైనా పోకిరీలు అమ్మాయిలను, యువతలను వేధిస్తే కఠిన చట్టాలు ఉన్నాయని చెప్పారు. పొక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. చదువుకునే వయసులో తప్పటడుగులు వేస్తే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పినమోని శ్రీనివాస్, కార్యదర్శి శ్రీ పి చంద్రశేఖర్, తాండూర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్, కళాశాల ప్రిన్సిపల్ బిజినెల్లి మల్లినాథ్ గారు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాశం రవికుమార్, అనిత గుప్తా, సోఫియా, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భూమి స్వాదీనంపై బ్రేకులు..!