
మీ కరెంటు బిల్లు తెసుకోవడం ఈజీ
– కొత్త వ్యవస్థను తెచ్చిన విద్యుత్ శాఖ
– వినియోగదారుల కోసం సదుపాయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అవును మీరు చదివింది నిజమే. మీ ఇంటి కరెంటు బిల్లు ఎంత వచ్చిందో మీరు తెలుసుకోవచ్చు. వినియోగదారులు వినియోగించిన కరెంటు బిల్లును తెలుసుకునేందుకు కొత్త వ్యవస్థను తీసుకవచ్చినట్లు దక్షిణ తెలంగాణ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ‘ప్రతినెలా 30 లేదా 31 రోజులకు మీటర్ రీడింగ్ నమోదుచేసి బిల్లు జారీచేయాలి.

కొన్ని సందర్భాల్లో రెండు లేదా మూడు రోజుల ఆలస్యంగా నమోదు చేస్తున్న కారణంగా ఆ నెలలో వినియోగించిన యూనిట్లు పెరగడంతో..టారిఫ్ మారి అధికంగా బిల్లులు వస్తున్నాయనే అపోహ కొందరు వినియోగదారుల్లో ఉంది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్‌సైట్‌లో ‘ఎనర్జీ ఛార్జెస్ కాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్’ పేరుతో ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
బిల్లులో నమోదైన రీడింగ్ తీసిన తాలూకు తేదీలు, యూనిట్ల వివరాలను కాలిక్యులేటర్‌లో నమోదుచేస్తే బిల్లింగ్ రోజులు, ఎంత ఛార్జీ వేశారనే వివరాలు తెలుస్తాయి. త్వరలో దీన్ని సంస్థ మొబైల్ యాప్‌లోనూ పొందుపరిచేందుకు సంస్థ చర్యలు చేపడుతోంది. దీంతో వ్యవస్థ అందుబాటులోకి వస్తే అందరు కరెంటు బిల్లును ఈజీగా తెలుసుకోవచ్చు.

ఇదికూడ చదవండి…

