రెండు ప్రాణాల కోసం రక్తదానం…!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrరెండు ప్రాణాల కోసం రక్తదానం..!
– మానవత్వం చాటిన డాక్టర్ సంపత్ కుమార్
– 158సార్లు రక్తదానం చేసి రికార్డు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకటి కాదు రెండు కడుపులో ఉన్న పసిపాపం, కడుపుతో ఉన్న గర్భిణీ ప్రాణాల కోసం తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బాలాజీ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ సంపత్ కుమార్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… కోడంగల్ మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మద్దూరు మహేష్ భార్య హర్షిత నిండు గర్భిణీ.

ప్రసవం కోసం తాండూరులోని జిల్లా ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడింది. గర్భిణీ అన్న ద్వారా విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. గర్భిణీ కోసం రక్తదానం చేయడం పట్ల కుటుంభీకులు డాక్టర్ సంపత్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు డాక్టర్ సంపత్ కుమార్ గర్భీణీ కోసం 158వ సారి రక్తదానం చేయడం విశేషం. తాండూరు నియోజకవర్గంలోని రక్తదాతల్లో రక్తదానం చేయడం ఇదే రికార్డు.

ఇదికూడా చదవండి…

బాలికతో బ్యాడ్‌ చాటింగ్..!