ఓవైసీపై భగ్గుమన్న బీజేపీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrఓవైసీపై భగ్గుమన్న బీజేపీ..!
– ఎంపీ పదవి నుంచి తొలగించాలి
– తాండూరులో దిష్టి బొమ్మదహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదోద్దీన్ ఓవైసీపై తాండూరు బీజేపీ నేతలు భగ్గుమన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యస్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో ఈ దర్నా జరిగింది.

ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్‌తో పాటు నేతలు హాజరై అసదోద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన అసదోద్దీన్ ఓవైసీ పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వాఖ్యలను ఖండించారు.

భారత దేశంలో ఉంటూ ఇతర దేశానికి జై కొట్టడంపై మండిపడ్డారు. అసదోద్దీన్‌పై భారత రాజ్యాంగం పట్ల చర్యలు తీసుకుని పార్లమెంట్‌ పదవి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సాహు శ్రీలత లక్ష్మీకాంత్, నాయకులు పూజారి పాండు, దోమ కృష్ణ, అంతారం కిరణ్‌, మంతటి రాజు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రెండు ప్రాణాల కోసం రక్తదానం…!