
కేవీసీఎస్లో ఎన్నికల సందడి..!
– ఆకట్టుకున్న మాక్ పోలింగ్
– ఓటు వినియోగించుకున్న విద్యార్థులు
– యజమాన్యం సందేశంకు తల్లిందండ్రులు ఫిదా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్(కేవీసీఎస్)లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల తీరుపై స్కూల్ ఆధ్వర్యంలో శనివారం మాక్ పోలింగ్ నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతి నుంచి హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించారు.

స్కూల్ కు చెందిన 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు సాధారణ ఎన్నికల మాదిరి బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విధానంలో విద్యార్థులకు అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరుగుతాయని అవగాహన కల్పించారు. ఆ ఎన్నికల మాదిరిగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాలెట్ బ్యాక్సులలో విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దీంతో స్కూల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే దశ నుంచే నాయకత్వ లక్షణాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైదో తెలుసుకొ వాలన్నారు. అందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయన్నారు. స్కూల్లో చదువుతో సాటు స్కాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.

మరోవైపు ఎన్నికల ఫలితాలలో హెడ్ బాయ్ గా సీ. జస్వంత్, డిప్యూటీ హెడ్ బాయ్ గా టీ. సంజయ్, హెడ్ గర్ల్ గా పీ. అమూల్య, డిప్యూటీ హెడ్ గర్ల్ గా కె. వర్షలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సతీష్, యజమాన్య కమిటి. టీచర్లు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

