రుణమాపీ రూల్స్‌పై క్లారీటీ..!
– రేషన్ కార్డు నిబంధన కేవలం దానికోసమే
– స్వయంగా వివరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అమలు చేయబోతున్న రుణమాఫీ రూర్స్పై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా క్లారీటీ ఇచ్చార. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్ల సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబరు 567) కూడా జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది.
రైతు కుటుంబం గుర్తింపునకు తెల్లరేషన్ కార్డు(ఆహారభద్రత కార్డు)ను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అన్ని షెడ్యూల్డు, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబరు 12 నుంచి మంజూరైన, రెన్యువలైన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని… రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. పాస్‌బుక్ ఆధారంగానే రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్‌కార్డు నిబంధన పెట్టినట్లు చెప్పారు.
ఇదికూడా చదవండి…

