ఉత్సహాంగా నో బ్యాగ్‌ డే..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఉత్సహాంగా నో బ్యాగ్‌ డే..!
– ఆడిపాడిన అక్షర విద్యార్థులు
– అబ్దుల్‌ కలాంకు నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్లో నో బ్యాగ్‌ డేను ఉత్సహాంగా జరుపుకున్నారు. ప్రభుత్వం ప్రతి నెల నాలుగో శనివారం నో బ్యాగ్‌ డేగా నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం అక్షర కాన్సెప్ట్ స్కూల్లో నో బ్యాగ్ డే నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు బ్యాగులు, పుస్తకాలు లేకుండా స్కూల్‌కు హాజరయ్యారు. విద్యార్థులు చదవుకు స్వస్తి చెప్పి ఆటలు, పాటలు, నాటకాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఉల్లాసంగా గడిపారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మోహన్ కృష్ణ గౌడ్, మేనేజ్‌ మెంట్‌ సభ్యులు శ్రీకాంత్ కులకర్ణి, యూనుస్‌, రవీందర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌లు మాట్లాడుతూ నో బ్యాగ్‌ డే నిర్వహణ వల్ల విద్యార్థులలో ఉత్సహాం నిండుతుందని అన్నారు. మిగతా రోజులలో చదువుపై ఎలాంటి ఒత్తిడి ఉండదని అన్నారు. మరోవైపు పాఠశాలలో మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

విద్యా ప్రమాణాలు పెంపొందించాలి