స్వచ్ఛతను మరిచిపోవద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్వచ్ఛతను మరిచిపోవద్దు..!
– కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్
– గాంధీనగర్ లో స్వచ్ఛదనం, పచ్చదనం ముగింపు
తాండూరు, దర్శిని ప్రతినిది : స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను ఎవ్వరు మరువరాదని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం వార్డులో గత 5రోజులుగా కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ గత 5 రోజులుగా స్వచ్ఛదనం పచ్చదనం ద్వారా చేపట్టిన పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, నీటి శుద్ధి కార్యక్రమాలను యధావిధిగా కొనసాగించాలన్నారు. స్వచ్ఛతను, పరిసరాల పరిశుభ్రత విషయాలను ఎవ్వరు మరిచిపోకుండా నిర్వహించాలన్నారు.

ఇందులో కాలనీ వాసులు ఆదర్శంగా నిలవాలన్నారు. అంతకుముందు కాలనీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ రాములు, పాఠశాల హెచ్ఎం నాగదేవి, టీచర్లు మాధవి, సరిత, జగదీశ్వరి, ఆర్పీ విజయలక్ష్మీ, ఎఎన్ఎం, అంగన్ వాడీ టీచర్ రాధ, ఆయమ్మ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

చదువుతోనే ఉన్నత స్థాయి..!