చెరువెంటి ఈశ్వరాలయంకు సీసీ రోడ్డు మంజూరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చెరువెంటి ఈశ్వరాలయంకు సీసీ రోడ్డు మంజూరు..!
– ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రోసిడింగ్స్ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని చెరువెంటి ఈశ్వారాలయం వద్ద సీసీ రోడ్డుకు మంజూరు అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆలయ కమిటి సభ్యులకు ప్రోసిడింగ్స్ అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్ల సమక్షంలో కమిటి సభ్యులు ప్రోసిడింగ్స్‌ను అందుకున్నారు. గత కొన్నేండ్లుగా. చెరువెంటి ఈశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆలయ కమిటి గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకవెళ్లారు. ఈ మేరకు ప్రత్యేక చొరవ తీసుకుని సీసీ రోడ్డుకు రూ. 10లక్షలు మంజూరు చేయించారు. దీంతో ఆలయ కమిటి సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, రాము, బీజేపీ ఫ్లోర్ అంతారం లలిత, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమ శేఖర్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, ఆలయ కమిటి అధ్యక్షులు వాలి శాంతుకుమార్, ప్రధాన కార్యదర్శి జొన్నల బస్వరాజ్, నేతలు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

చదువున్న పాఠశాలపై మమకారం..!