చవితి పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి
– మండపాలకు అనుమతులు తప్పనిసరి
– కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతగా జరుపుకోవాలని కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. మంగళవారం కరణ్ కోట్ పోలీస్టేషన్ లో మండల రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఉత్సవ సమితి నిర్వహకులు మండపాలకు అనుమతి తీసుకోవాలన్నారు. ఇందుకోసం మీసేవా, ఆన్లైన్లో నమోదు చలాన చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు.
అదేవిధంగా మండల పాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులతో పాటు సంఘాల ప్రతినిధులు, మత పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…


