కేసీఆర్ ఆసరా.. పేదలకు భరోసా..!
– 57 ఏండ్ల ఆర్హులందరికి ఫించన్
– టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందించే ఆసరా పథకం పేదలకు ఎంతో భరోసా కల్పిస్తుందని టీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో నూతనంగా ఆసరా ఫించన్ మంజూరైన లబ్దిదారులకు అఫ్పూ(నయూం) గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు, డయాలిస్ బాధితులకు ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. తాజాగా 65 ఏండ్ల ఫించన్ అర్హత వయస్సును 57 ఏండ్లకు తగ్గించి పేదలకు అందిస్తున్నారని అన్నారు. ఇందుకు అర్హులైన లబ్దిదారులు కేసీఆర్‌కు కృతజ్ఞతగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువనాయకులు అబుకర్. వార్డు యువకులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.


