మద్యం పంపకాల్లో తేడా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మద్యం పంపకాల్లో తేడా..!
– చేసిన చోరీలు చెప్పేస్తాడనే భయం
– బెల్టుతో గొంతు బిగించి వ్యక్తి హత్య
– ఇద్దరి హంతకుల అరెస్టు, రిమాండు
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– వీడిన గోపాల్ పూర్ వ్యక్తి అనునాదాస్పద మృతి మిస్టరీ
తాండూరు రూరల్ / పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : మద్యం పంపకాల్లో తేడా రావడంతో చేసిన చోరీలు ఎక్కడ చెప్పేస్తాడనే భయంతో వ్యక్తిని బెల్టుతో గొంతు బిగించి హత్య చేశారు. గతనెల ఆగస్టు 30న పెద్దేముల్ మండలం గోపాల్ పూర్ గ్రామ శివారు దర్మీ చెట్టు సమీపంలో సుద్దగుంతలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి మిస్టరీని పోలీసులు చేధించారు. శుక్రవారం తాండూరు మండలం రూరల్ సీఐ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సీఐ అశోక్ కుమార్, పెద్దేముల్ ఎస్ఐ గిరిలతో కలిసి కీసు వివరాలను వెల్లడించారు.

మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బండమీది రమేష్ (32) ఆగస్టు 31న అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మృతుడి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సల్ బత్తాపూర్ గ్రామానికి చెందిన గంగనపల్లి శ్రీకాంత్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రుద్రారం గ్రామానికి చెందిన బండమీది నరేష్ బందువులు. 29వ తేదిన నరేష్, శ్రీకాంత్ లు హైదరాబాద్ పటాన్ చెరువు నుంచి బైకు ప్రె సల్ బత్తాపూర్ గ్రామానికి బైకుపై వచ్చారు. అదే రోజు రాత్రి పక్క కాలనీలో పార్కింగ్ చేసిన బ్రిజ్ఞా కారు డబ్బులు దొరుకుతాయనే ఆశతో అద్దాలను హేమర్ తో పగుల గొట్టారు. డబ్బులు లేకపోవడంతో అందులో ఉన్న ఓ కెమెరాను దొంగలించి ఇంట్లో దాచి పెట్టుకున్నారు.

మరుసటి రోజు 30వ తేదిన శ్రీకాంత్, నరేష్ లు తాండూరుకు వచ్చారు. అక్కడ బండమీది రమేష్ కలవడంతో రాత్రి వేళ ముగ్గురు బైకుపై పెద్దేముల్ మండలంకు చేరుకున్నారు. మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో పెద్దేముల్ తాండా రోడ్డులో ఉన్న ఓ కల్లు కంపౌండ్ లో దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. లోపలికి ప్రవేశించి 13. లిక్కర్ క్వాటర్ బాటిళ్లు చోరీ చేశారు. గోపాల్ పూర్ శివారులోని దర్మీ చెట్టు వద్ద సుద్ద గుంత వద్ద దొంగిలించిన వాటితో మద్యం సేవించారు. మిగిలిన బాటిళ్లను పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రమేష్ తనకు ఎక్కువ బాటిళ్లు కావాలని. మిగిలిన వాటిని మీ ఇద్దరు సమానంగా పంచుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చేసిన దొంగతనాలను అందరికి చెబుతానని బెదిరించాడు.

దీంతో భయపడిన శ్రీకాంత్, నరె ష్ లు రమేష్ ను చంపేందుకు పథకం వేశారు. నరేష్ బెల్టు తీసి రమేష్ మెడకు బిగించగా శ్రీకాంత్ కాళ్లు చేతులు పట్టుకున్నారు. రమేష్ ఊపిరిడాక అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని సుద్దగుంతలో పడేసి సల్ బత్తాపూర్ వెళ్లిపోయారు. మరుసటి రోజు కుమారుడి మృతిపై నాగమ్మ శ్రీకాంత్, నరేష్ లతో కనిపించడంతో వారిపై అనుమానం వ్యక్తం చేసింది. అదేవిధంగా మృతదేహం వద్ద శ్రీకాంత్ కు చెందిన పర్సు.

అందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు లభించాయి. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐఐ గిరి నిందితుడు శ్రీకాంత్ ను విచారించగా నేరం అంగీకరించాడు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుల నుంచి కెమెరా, బెల్టు, సుత్తెలను స్వాదీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

యాలకుల పాలు.. మెండు పోషకాలు..!