మమ్మేల వయ్యా.. గణపయ్యా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మమ్మేల వయ్యా.. గణపయ్యా..!
– మున్సిపల్‌ చైర్‌ పర్సన్ ఇంట్లో వినాయక చవితి
– పూజలు నిర్వహించిన స్వప్న, పరిమళ్‌ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేల వయ్యా ఓ బొజ్జ గణపయ్యా అంటూ తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ వినాయకున్ని వేడుకున్నారు. శనివారం వినాయక చవితి సందర్భంగా వారి నివాసంలో ప్రతి యేడాది మాదిరిగానే వినాయకున్ని ప్రతిష్టించారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, పరిమళ్ గుప్త దంపతులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీప, దూపాలతో పాటు ఉండ్రాళ్ల నైవేధ్యం సమర్పించారు. అందరిని సల్లంగా చూడాలని వినాయకున్ని వేడుకున్నారు. అనంతరం ఆమె మామ గారు ప్రభాకర్ గుప్తతో పాటు కుటుంబ సభ్యులు వినాయకున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ మాట్లాడుతూ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పండగను భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని, వినాయకుని కృప అందరికి సిద్దించాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి…

గణేష్ మహరాజ్ కీ.. జై..!