గనులశాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి
– మరో శాఖను కేటాయించిన సీఎం కేసీఆర్
– సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి మంత్రిత్వ శాఖ ఖరార్యయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహేందర్ రెడ్డికి మంత్రి శాఖను కేటాయించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డిని నియమించారు. గురువారమే రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై.. మహేందర్‌రెడ్డితో ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే మహేందర్ రెడ్డికి ఏ శాఖను కేటాయించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. రాత్రి సమయానికే సీఎం కేసీఆర్ మహేందర్ రెడ్డికి మంత్రిత్వ శాఖను కేటాయించారు. మంత్రి వర్గంలో చోటు కల్పించడం పట్ల మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి…

