గణనాథుల సేవలో పట్నం యువనేత

తాండూరు రాజకీయం వికారాబాద్

గణనాథుల సేవలో పట్నం యువనేత
– వినాయకులను దర్శించుకున్న రినీష్ రెడ్డి
– సన్మానించిన సమితిల నిర్వహకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి సందడి చేశారు. రెండో రోజు ఆదివారం పూజలందుకున్న గణనాథులను రినీష్ రెడ్డి దర్శించుకున్నారు. రినీష్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నేతలతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన వినాయకుల మండపాలను సందర్శించారు. కొలువుదీరిన గణపయ్యలను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అనంతరం మండపాల నిర్వహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ పండగను అందరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. వినాయుకుని అశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాము, మాజీ కౌన్సిలర్ పరిమళ, నాయకులు బిడ్కర్ రఘు, బీదర్ రాజశేఖర్, పునీత్ కుమార్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మమ్మేల వయ్యా.. గణపయ్యా..!