రేపు తాండూరులో పవర్ కట్
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ ఏఈ వెంకట్ నాయుడు వెల్లడించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ జరఫరా జరగదని స్పష్టం చేవారు. విద్యుత్ అంతరాయానికి అన్ని గ్రామాల్లోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. మరమ్మత్తులు పూర్తయిన తరువాత యధావిధిగా విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు.
ఇదికూడా చదవండి..

