అత్యవసరం.. అర్ధాంతరమే..!
– చర్చలేకుండానే ముగిసిన సమావేశం
– దృవీకరించిన ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం అర్దాంతరంగా ముగిసింది. తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ సమన్వయంతో మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని మున్సిపల్ ఆస్తులు, పార్కుల పరిరక్షణ అనే అంశంపైనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సమావేశం ప్రారంభంలోనే అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, వరాల శ్రీనివాస్‌రెడ్డి, సోమశేఖర్, ఆసిఫ్‌ల మద్య వాదనలు జరిగాయన్నారు. సర్వేనెంబర్ 52 విషయంలో,
పార్కుల సంరక్షణ విషయంలో చర్చ జరుగుతుండగానే సీపీఐ ఫ్లోర్ లీడర్ అసిఫ్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సాజిద్ అలీల మద్య తీవ్ర ఆరోపణల యుద్దం జరిగిందన్నారు. ఈ క్రమంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సమావేశం నుంచి బయటకు వచ్చారు. అనంతరం సమావేశాన్ని ముగించినట్లు తెలిపారని చెప్పారు. దీంతో అత్యవసర సమావేశం ఎలాంటి చర్చలేకుండానే ముగిసిందని వెల్లడించారు. శనివారం జరిగిన సమావేశంలో వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, టీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు హాజరుకాగ, మున్సిపల్ వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.

