వార్డు సమస్యల పరిష్కారానికి చర్యలు
– మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
– మార్నింగ్ వాక్‌లో వార్డుల సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వార్డుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం 4వ వార్డులో మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీంతో పాటు వార్డు పెద్దలతో కలిసి పర్యటించారు. వార్డులో వీధీ దీపాలు, ఫారిశుద్యం, తాగునీటి సరఫరా నిర్వహణ పనులను సమీక్షించారు.
ఇంకా స్థానిక ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. అబ్దుల్ సలీం మున్సిపల్ కమీషనర్‌కు వార్డు సమస్యలను వివరించారు. ఇందుకు స్పందించిన కమీషనర్ వార్డులోని సమస్యలను గుర్తించి దశలవారిగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇనుస్పెక్టర్ వెంకటయ్య, జవాన్ సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

