కురువలు అన్ని రంగాల్లో రాణించాలి
– తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సదానందం
– తాండూరు పట్టణ కురువ సంఘం నూతన కమిటి ఎన్నిక
తాండూరు దర్శిని ప్రతినిధి : కురువలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ కురువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సదానందం అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్లో తాండూరు డివిజన్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షులు కె.సదానందం, పలువురు నేతలు హాజరయ్యారు. సమక్షంలో తాండూరు పట్టణ కురువ సంఘం నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మరాఠి నర్సింలు, ఉపాధ్యక్షులుగా మిట్టి మహేష్(మల్ రెడ్డిపల్లి), సహాయ ఉపాధ్యక్షులుగా కురువ మల్లప్ప(సాయిపూర్), ప్రధాన కార్యదర్శిగా నాగులపల్లి నర్సింలు, సహాయ కార్యదర్శిగా నాగప్ప (గొల్ల చెరువు), కోశాధికారిగా దస్తగిరి నర్సింలు (మల్ రెడ్డిపల్లి)లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సదానందం మాట్లాడుతూ కురువలు అన్ని రంగాల్లో రాణించాలంటే సంఘం సభ్యులందరు ఏకతాటిపైకి వచ్చి హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. కురువ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా నూతన కమిటి సభ్యులు కూడా మాట్లాడుతూ తమపై ఉంచిన బాధ్యతకు అనుగుణంగా పనిచేసి కురువ అభివృద్ధికి పాటుపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవాధ్యక్షులు న్యాయవాది గోపాల్, అధ్యక్షులు నాగారం జగదీష్, ఉపాధ్యక్షులు పూజారి పాండు, ప్రధాన కార్యదర్శి ఇందూరు మల్లేశం, సహాయ కార్యదర్శి టీ. రమేష్, కోశాధికారి గొల్ల మల్లప్ప, సంఘం పెద్దలు జినుగుర్తి నర్సింలు, హనుమయ్య, చీమల నర్సింలు, పూజారి మల్లప్ప, పల్లే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

