మహిళల సంక్షేమమే ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళల సంక్షేమమే ధ్యేయం..!
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మహాలక్ష్మీ సిలిండర్ లబ్దిదారులకు గుర్తింపు పత్రాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చె వస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్ లో ప్రజా పాలన మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు అమలు చేస్తున్న రూ. 500లకే గ్యాస్ సిలిండర్ లబ్దిదారులకు సబ్సీడీ గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారానే గ్యాస్ సిలిండర్ పై రూ.500ల సబ్సీడీని ఇస్తోందన్నారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. త్వరలోనే రూ.2500ల ఆర్థిక చేయూతను కూడా అమలు చేస్తుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలందరికి సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.

తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, కోట్లు వెచ్చించి చిలుక వాగు ప్రక్షాళన, కాగ్నానది నుంచి మున్సిపల్ కు పైపులైన్ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో పాటు విద్యా, వైద్యం ఇతర అంశాలలో తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయదేవి, ప్రభాకర్ గౌడ్, బోయ రవి, ప్రవీణ్ గౌడ్, రాము, బొంబీనా, సల్మా ఫాతిమా, బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మహిళ నాయకురాలు గాజుల మాధవీ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

సరిలేరు.. సంపత్‌ సార్‌ సాటెవ్వరు..!