మట్టి మాఫీయాపై కొరడా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మట్టి మాఫీయాపై కొరడా..!
– ప్రభుత్వ భూమిలో తవ్వకాలపై సీరీయస్
– తవ్వకాలను నిలిపివేసిన అధికారులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అక్రమంగా తవ్వకాలు చేస్తున్న మట్టి మాఫీయాపై అధికారులు కొరడా జులిపించారు. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టడంపై తీవ్రంగా హెచ్చరించారు. వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం అంతారం గ్రామ పరిధి సర్వేనెంబర్ 58లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిలో కొందరు అక్రమార్కులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. గురువారం తాండూరు రెవెన్యూ, మైన్స్ అధికారులు ఈ తవ్వకాలపై స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే తవ్వకాలు జరిపే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలు నిలిపివేసి యంత్రాలను తరలించాలని సూచించారు. లేదంటే యంత్రాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులు బెంబేలెత్తిపోయారు.

ఇదికూడా చదవండి…

రేపు తాండూరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక