బల్దియాలో బతుకమ్మ జోష్..!
– అట్టహాసంగా సంబరాలు
– పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాల జోష్ నిండింది. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు బతుకమ్మను అలంకరించి తీసుకవచ్చారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ లు బతుకమ్మకు పూజలు నిర్వహించి సంబరాలు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మహిళలు, ఉద్యోగులు బతుకమ్మ ఆట పాటలతో దుమ్ము లేపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ సంప్రదాయాలను గౌరవంగా కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయదేవి, అధికారులు, ఆర్పీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

